డిజిటల్ దొండపాడు.. 218 మందికి సర్టిఫికెట్లు - MicTv.in - Telugu News
mictv telugu

డిజిటల్ దొండపాడు.. 218 మందికి సర్టిఫికెట్లు

February 17, 2018

సూర్యాపేట జిల్లా దొండపాడు గ్రామం డిజిటల్ బాటలో దూసుకెళ్తోంది. ఏహెచ్ఆర్ ఫౌండేషన్, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా)లు  సంయుక్తంగా గ్రామంలో 218 మందిని డిజిటల్ గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దాయి. ఏహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అన్నపరెడ్డి అప్పిరెడ్డి స్వగ్రామమైన ఈ ఊరిలో డిజిథాన్ కార్యక్రమంలో కింద ఒక్కో ఇంటికి ఒక్కొక్కరిని ఎంపిక చేసి ఇంటర్నెట్ వినియోగం, ఆన్ లైన్ బిల్లు చెల్లింపు వంటి డిజిటల్ అంశాల్లో శిక్షణ ఇచ్చారు.

దొండపాడులో శనివారం జరిగిన ఏహెచ్ఆర్ ఫౌండేషన్ 6వ వార్షికోత్సవం, డిజిథాన్ ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తున్న అప్పిరెడ్డి. చిత్రంలో జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి తదితరులు

డిజిథాన్ ముగింపు కార్యక్రమం, ఏహెచ్ఆర్ ఫౌండేషన్ 6వ వార్షికోత్సవాలను దొండపాడులో శనివారం ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి.. డిజిటల్ గ్రాడ్యుయేట్లకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అప్పిరెడ్డి, అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, అన్నపరెడ్డి అక్కమ్మ, టీటా అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తల, ఉపాధ్యక్షుడు రాణాప్రతాప్ బొజ్జం, అధికార ప్రతినిధి వెంకట వనం తదితరులు పాల్గొన్నారు.

డిజిథాన్ కింద డిజిటల్ అంశాల్లో శిక్షణ పొందిన దొండపాడు గ్రామస్తులు