ఈ బాబాలతో జర భద్రం..! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ బాబాలతో జర భద్రం..!

July 16, 2017

మాటలతోనే మ్యాజిక్…అర చేతి చూసి భవిష్యత్ వాణి..కష్టాలు అన్ని క్షణాల్లో మాయం..అంటూ జనాన్ని నమ్మించాడు ఒక్కరినీ కాదు ఇద్దరినీ కాదు ఊరు మొత్తానికి బిస్కట్లు వేశాడు. ఇలా నాలుగైదు లక్షలు వసూలు చేసి చెక్కేశాడు..ఇంతకీ ఈయన ఎవరు అంటే బురిడీ బాబా..

మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలం శివారులోని వింగ్వా తండాలో దొంగబాబా మాయాజాలం ప్రదర్శించాడు.ఇస్లావత్ రాము, తండ్రి లింగ్యా అనే వ్యక్తి తండాకు స్వామీని తీసుకువచ్చాడు. గ్రామానికి వచ్చిన స్వామి చేయి చూసినందుకు ఫీజుగా రూ. 200 వసూలు చేశాడు. అంతటితో ఆగలేదు. ఈ మాట ఆ మాట చెప్పి..వారిని భయపెట్టి ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.15 వేల నుంచి 25 వేల వరకు, మొత్తం దాదాపు నాలుగైదు లక్షల నగదు వసూలు చేశాడు.ఇలా వసూలూ చేసిన దొంగబాబా రాత్రికి రాత్రే చెక్కేశాడు. మోసపోయామని తెలుసుకున్న గ్రామస్తులు కురివి పోలీసులకు కంప్లయింట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బురిడీ బాబా కోసం గాలిస్తున్నారు.

చూశారా..బాబాల మాయ మాటలకు పడిపోతే ఏమవుతుందో..మీ ఊరికి.. మీ గల్లీకి కూడా ఎవరైనా ఇలా వచ్చి చేయి చూసి అది ఇది చెబుతామంటే నమ్మకండి..నిలువునా మునిగిపోతారు..అందుకే బురిడీ బాబాలతో జాగ్రత…