ఎన్టీఆర్‌తో సినిమా గురించి నన్నడగొద్దు : ప్రశాంత్ నీల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్టీఆర్‌తో సినిమా గురించి నన్నడగొద్దు : ప్రశాంత్ నీల్

April 11, 2022

ntr

కెజిఎఫ్ సిరీస్ సినిమాలతో పాపులర్ అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్ త్వరలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం కెజిఎఫ్ 2 విడుదలకు సిద్ధమవుతుండడంతో ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇరవై ఏళ్లుగా ఎన్టీఆర్ అభిమానిని. గత రెండేళ్లుగా మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. ఆయనతో సినిమా చేయడానికి కథ వినిపించా. ఎన్టీఆర్‌కు బాగా నచ్చింది. కానీ, ఏ జానర్ అని మాత్రం అడగొద్దు’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా, ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. ఇది పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ సినిమా ఉండే అవకాశం ఉంది.