dont buy tv,fridge hold your money :Jeff Bezos
mictv telugu

టీవీలు, ఫ్రిజ్‌లు కొనొద్దు..కాస్త ఆగండి

November 19, 2022

ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందని ప్రపంచం కోడై కూస్తుంది. టెక్ సంస్థలు సైతం ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ సమయంలో ప్రజలకు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరు ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. తన వ్యాపారం పడిపోయినా పర్వాలేదు కానీ మాంద్యం ముప్పులోకి ప్రజలు రావొద్దని హెచ్చరించారు. ఆన్ లైన్ షాపింగ్‌ను తగ్గించుకోవాలని కోరారు. అనవసరపు ఖర్చులు పెట్టకుండా..డబ్బులను దాచుకోవాలన్నారు. ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారిపోయే ప్రమాదం ఉన్నందున రిఫ్రిజిరేటర్లు. టీవీలు లేదా సరికొత్త కార్ల వంటి పెద్ద ధర కలిగిన వస్తువులను కొనుగోలు చేయకూడదని కుటుంబాలకు సిఫార్సు చేశారు. చిన్న వ్యాపార యజమానులు కూడా సంయమనం పాటించాలని జెఫ్ బెజోస్ సూచించారు. కొత్త పెట్టుబడులను నిలిపివేయాలని..వారి నగదు నిల్వలను కాపాడుకోవాలన్నారు.ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు దృష్ట్యా అనే రంగాలలో ఉద్యోగుల తొలగింపులు తప్పవని జెఫ్ బెజోస్ పేర్కొన్నారు.