దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణ సంఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ కానిస్టేబుల్‌పై కొంతమంది యువకులు తీవ్రంగా దాడి చేశారు. అంతేకాదు, ఆ కానిస్టేబుల్‌పై దాడి చేస్తున్న సమయంలో ఎవరు అడ్డుపడకుండా తమ తమ ఫోన్లలో వీడియోలు, ఫోటోలు తీశారు. అయితే, ఆ వీడియోలో ‘ప్లీజ్ నన్ను కొట్టకండి-మీకూ దండం పెడతాను’ అంటూ ఆ కానిస్టేబుల్ రెండు చేతులెత్తి వేడుకున్నట్లు కనపడుతోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
अंधेर गर्दी है दिल्ली में, #DelhiPolice #Delhi pic.twitter.com/JfBLNdNuIM
— Dhananjay Singh (@KunwarDJAY) August 6, 2022
వివరాల్లోకి వెళ్తే.. న్యూఢిల్లీ ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్లో ఆగస్టు 3వ తేదీన ఈ ఘటన జరిగింది. సుమారు పది, పన్నెండు మంది చుట్టూ చేరి ఓ కానిస్టేబుల్‌ను విచక్షణ రహితంగా కొట్టారు. చుట్టుపక్కల చాలా మంది ఆ ఘటనను వీడియో, ఫొటోలు తీశారు కానీ, ఎవరూ వాళ్లను ఆపే ప్రయత్నం చేయలేదు. బాధితుడు ఆ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్‌గా తెలుస్తోంది. క్షమించి వదిలేయాలని ఆ కానిస్టేబుల్ వేడుకోవడం వీడియోలో చూడొచ్చు.
అయితే, ఆ కానిస్టేబుల్ ఏం తప్పు చేశాడు? ఎందుకు అతడిని చితకబాదారు? అనే కారణాలేమీ తెలియవు కానీ, పోలీసులపై దాడి చేయడాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. దాడి చేసిన వాళ్లను గుర్తించి, వారిన కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. దాంతో స్పందించిన ఢిల్లీ పోలీసు విభాగం.. వీడియోలో ఉన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.