స్నేహితులతో కలిసి పక్షుల్లా వివహరించడం చాలా మందికి ఇష్టం. అప్పుడప్పుడు మన చుట్టుపక్కల ప్రదేశాలకు స్నేహితులతో కలిసి వెళ్లినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేం. మీరు కూడా మీ స్నేహితులతో కలిసి గోవా ట్రిప్ కు ప్లాన్ చేస్తున్నారా. అయితే గోవాలో కొన్ని ప్రదేశాలు చూడటం అస్సలు మిస్సవ్వకండి. స్నేహితులతో కలిసి అక్కడ గడిపే క్షణాలు మీలో నూతనుత్తేజాన్ని నింపడమే కాదు..ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలను అందిస్తాయి. గోవాలో చూడాల్సిన అందమైన ప్రదేశాలేంటో చూద్దాం.
చపోరా కోట:
చపోరా కోట గోవాలోని చారిత్రక ప్రదేశాలలో ఒకటి. ఈ కోటను 1717లో పోర్చుగీసు వారు నిర్మించారు. కోట చుట్టూ ఉన్న పచ్చదనం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. స్నేహితులతో ఫోటోలు క్లిక్ చేయడానికి బాగుంటుంది.ఈ చపోరా కోటలో చాలా బాలీవుడ్ సినిమాలు నిర్మించారు. ఈ కోట సందర్శకులకు అందమైన సూర్యాస్తమయ వీక్షణను అందిస్తుంది. వాగేటర్ బీచ్ మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది.
క్యాసినో రాయల్:
గోవాలోని క్యాసినో రాయల్ క్రూజ్ మీకు లగ్జరీ అనుభవాన్ని అందిస్తుంది. ఇక్కడ రాయల్ పోకర్ రూమ్, అమెరికన్ రౌలెట్, ఇండియన్ ఫ్లష్, బ్లాక్ జాక్ వంటి అనేక ఇతర గదులు ఉన్నాయి. ఆహ్లాదకరమైన మండోవి నదిపై విహారయాత్ర ఈ కాసినోలతో నిజంగా థ్రిల్లింగ్‌గా ఉంటుంది.
మోబోర్ బీచ్:
గోవాలో డజన్ల కొద్దీ బీచ్‌లు ఉన్నాయి. వాటిలో, మోబోర్ బీచ్ చాలా ఫేమస్. ఇది చాలా విశాలంగా ఉంటుంది. వాటర్ స్పోర్ట్స్, ఫిషింగ్‌కు ఈ బీచ్ చాలా ప్రసిద్ధి. అంతే కాదు ఈ బీచ్‌లో డాల్ఫిన్‌లు, పక్షులు కనిపిస్తాయి. ఈ బీచ్ ఎలాంటి చడిచప్పుడు లేకుండా నిశ్శబ్దంగా ఉంటుంది.
గ్రాండే ద్వీపం:
గోవాలో చాలా అందమైన ద్వీపాలు ఉన్నాయి. అందులో ఈ గ్రాండే ఐలాండ్ కూడా ఒకటి. ఇక్కడ స్కూబా డైవింగ్ చాలా ప్రసిద్ధి. అంతే కాదు, మీరు స్నార్కెలింగ్, డాల్ఫిన్ స్పాటింగ్ వంటి థ్రిల్లింగ్ కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. గోవా రాజధాని పనాజీ నుండి పడవలో చేరుకోవచ్చు. సముద్రం మధ్యలో అగుడా కోట, లైట్ హౌస్, సెంట్రల్ జైలు వంటి ఆసక్తికరమైన ప్రదేశాలను చూడవచ్చు.
లార్డ్ మహావీర అభయారణ్యం:
మీరు వన్యప్రాణులను దగ్గరగా చూడాలనుకుంటే, స్నేహితులతో కలిసి భగవాన్ మహావీర అభయారణ్యం సందర్శించండి. భారతదేశంలోని పశ్చిమ కనుమలలో ఉన్న ఈ అభయారణ్యం 240 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ మీరు రకరకాల జంతువులు, పక్షులను చూడవచ్చు.