Don't release Aamir Khan's Lal Singh Chadha movie
mictv telugu

ఆ సినిమా విడుదల చేస్తే అమీర్ ఖాన్ కెరీర్ ముగిసిపోతుంది

July 10, 2022

బాలీవుడ్ సినిమాలతో పాటు ముఖ్యంగా దక్షిణాది హిట్ సినిమాలను తీవ్రంగా విమర్శించడంలో ముందుండే సినీ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ తాజాగా బాలీవుడ్ చిత్రంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా గురించి ప్రతీరోజు తనకు నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయని తెలిపాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుందని, సినిమాను రిలీజ్ చేయకపోవడం మంచిదని పేర్కొన్నారు. కాదని రిలీజ్ చేస్తే ఆ సినిమాతోటే అమీర్ ఖాన్ కెరీర్ ముగిసిపోతుందని వెల్లడించారు. దీంతో నెటిజన్లు ఇతడిని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. అమీర్ ఖాన్ సినిమాలనే విమర్శించేంత గొప్పోడివయ్యావా? అంటూ నిలదీస్తున్నారు. కాగా, నాగచైతన్య కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో కరీనాకపూర్ హీరోయిన్‌గా నటించింది.