Don't second guess yourself: KCR
mictv telugu

మీకూ మీరే ఊహించుకోకండి: కేసీఆర్

August 14, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటు అధికారపక్షం, అటు ప్రతిపక్షాలు మునుగోడు ఉపఎన్నికపై భారీ ఫోకస్ పెట్టాయి. తమ తమ పార్టీల అభ్యర్థిగా ఎవరిని నియమించాలి? మునుగోడు ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు? అనే విషయాలపై గతకొన్ని రోజులుగా ఆయా పార్టీల్లో తెగ చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మునుగోడుకు ఫలానా వ్యక్తి అయితే బాగుంటుంది? ఆ వ్యక్తే గెలుస్తాడు అంటూ ఎవరికి వారే తమ ఊహికు నచ్చిన విధంగా ఊహించుకొని, తమ అభిప్రాయాలను అధిష్టానికి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ తరుపున ఎవరిని అభ్యర్థిగా నియమించాలి అనే అంశంపై శనివారం కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమయ్యారు.

సమావేశంలో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ..” ఏ ఎన్నికలోనైనా ఆశావహులు చాలామంది ఉంటారు. గెలుపు గుర్రానికే అవకాశం ఉంటుంది. మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై అధిష్టానానిదే తుది నిర్ణయం. ఎవరికివారే ఊహించుకోకండి. అలాంటి ఆశలు ఏమీ పెట్టుకోకండి. అన్ని విధాలుగా కసరత్తు చేసి, అభ్యర్థిని ఎంపిక చేస్తాం. సరైన సమయంలో ప్రకటిస్తాం” అని ఆయన అన్నారు.

ఇక, టీఆర్ఎస్ తరుపున అభ్యర్థి ఎవరు అనే అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కేసీఆర్ తెలిపారు. “పార్టీ అభ్యర్థిత్వంపై ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎవరికి వారు తామే అభ్యర్థి అనుకోవద్దు. 2014లో గెలిచిన పార్టీ 2018లో కొద్ది తేడాతో ఓడింది. తర్వాత స్థానిక ఎన్నికల్లో పుంజుకుంది. నియోజకవర్గంపై సంపూర్ణ అవగాహనతోనే నిర్ణయం తీసుకుంటాం. అభ్యర్థి ఎవరైనా గెలిపించుకునే పూర్తి బాధ్యత పార్టీ మీదే ఉంటుంది. దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులు క్రమశిక్షణతో పనిచేయాలి” అని కేసీఆర్ అన్నారు.