మన రోజు వారీ జీవితంలో బోలెడు విషయాలు జరుగుతుంటాయి. అన్ని విషయాలను మనలో మనమే దాచుకోవడం కష్టం. అలాంటప్పుడు నమ్మకమైన వారికి చెప్పుకోవాలనిపిస్తుంది. మనకు మాత్రమే సొంతమైన వాటిని కూడా కొన్నింటిని షేర్ చేసుకుంటుంటాం. కాకపోతే అవి సీక్రెట్ గా ఉండాలని అనుకుంటాం. అయితే అలాంటి వాటిల్లో కూడా కొన్నింటిని ఎవ్వరితోనూ చెప్పకపోవడమే మంచిది. అలాంటి విషయాలేంటో మీకు తెలుసా మరి.
డబ్బులు:
వీలయినంత వరకు మన డబ్బులకు సంబంధించిన విషయాలు ఇతరులతో చెప్పకోకపోవడమే మంచిది. బ్యాంక్ అకౌంట్ లో దాచిన డబ్బులు, బంగారం, సాలరీ లాంటి విషయాలు మన దగ్గరే ఉంచుకుంటే బెటర్.
ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్:
కుటుంబంలో జరిగే తగాదాలు, సమస్యలు లాంటి విషయాలు షేర్ చేసుకోకూడదు. అవి నిజంగానే సీక్రెట్స్. ముఖ్యంగా భార్య భర్తల మధ్య జరిగే విషయాలను మూడో కంటికి, చెవిన కూడా పడడం మంచిది కాదు.
లక్ష్యం:
ఎవరితోనూ చెప్పకూడని ప్రధాన రహస్యం మన జీవిత గమ్యం. కెరీర్, ఫిట్ నెస్ లాంటి విషయాలు ఎవరితోనూ చెప్పకుండా ఉంటేనే బెటర్. చెప్పడం కన్నా చేసి చూపిస్తేనే మంచిది.
ప్రేమ:
ఎవరిని ప్రేమిస్తున్నామో, ఎంత ప్రేమిస్తున్నామో ఇతరులకు చెప్పకూడదు. పార్టనర్ తో ఎలా ఉండాలనుకుంటున్నామో కూడా సీక్రెట్ గానే ఉంచుకుంటే మంచిది. ఇది పూర్తిగా మన పర్శనల్ ఛాయిస్, ప్రైవసీ కాబట్టి అందరికీ తెలియాల్సిన అవసరం లేదు.
రొమాంటిక్ లైఫ్:
పార్టనర్ తో జరిపై రొమాంటిక్ లైఫ్ గురించి ఇతరులతో అస్సలు డిస్కస్ చేయకూడదు. షేర్ అసలే చేసుకోవద్దు.
అవమానం:
ఎప్పుడైనా మనకు అవమానం జరిగినా, మనల్ని అవమానించినట్లయితే ఆ విషయం మన మనస్సులోనే ఉంచుకోవాలి. ఇతరులతో పంచుకోకూడదు. అది మనల్ని మనమే మరి కొంచెం కించపరుచుకున్నట్టు అవుతుంది.
బలహీనత:
ప్రతీ ఒక్కరికీ బలహీనత ఉంటుంది. బలహీనతలు లేని మనిషి ఈ భూ ప్రపంచం మీద ఉండడు. అయితే వీటిని మనలోనే ఉంచుకుంటే మంచిది. ఇవి అస్సలు ఎవ్వరితోనూ పంచుకోకూడదు. దానివల్ల మనం అందరికీ చులకన అయ్యే ప్రమాదం ఉంది.
వయసు:
దీన్ని చాలా మంది సీక్రెట్ గా ఉంచుకుంటారు. అయితే ఇది అంత సీక్రెట్ గా ఉంచుకోవాల్సిన మేటర్ ఏమీ కాదు. మన వయసు ఇతరులకు తెలిసినా పెద్దగా నష్టపోయేదీ, లాభం వచ్చేదీ కూడా ఏమీ ఉండదు.