Don't use shampoos in case of nuclear war: America's sensational advice
mictv telugu

అణు యుద్ధం జరిగితే షాంపూలు వాడకండి : అమెరికా సంచలన సలహా

September 23, 2022

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతుండగా, పాశ్చాత్య దేశాలు రష్యాను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నాయని, ఈ క్రమంలో తాము అణు బాంబు వేయడానికి కూడా సిద్ధమేనని పుతిన్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒకవేళ నిజంగా అణు యుద్ధం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్రరాజ్యం అమెరికా తన దేశ పౌరులకు సలహాలు, సూచనలు ఇచ్చింది. ఆ సమయంలో షాంపూలు, కండీషనర్లు వాడకూడదని హెచ్చిరించింది. సాధారణంగా అవి మీ జుట్టును రక్షిస్తాయి కానీ, అణు విస్ఫోటనం సంభవించినప్పుడు రేడియో ధార్మిక పదార్ధాలను ఆకర్షిస్తామని తెలిపింది. గాల్లో కలిసిపోయిన రేడియో ధార్మిక ధూళి కణాలు జుట్టును ట్రాప్ చేసే అవకాశాలున్నాయని, తద్వారా మనిషి కణాలు దెబ్బతిని ప్రాణాంతక పరిస్థితులు ఎదురవుతాయని సూచించింది. అంతేకాక, అణు బాంబు పేలితే రేడియేషన్ నివారించడానికి ఇటుక లేదా కాంక్రీటు భవనాల్లో రక్షణ పొందాలని కళ్లు, ముక్కు నోటిని తాకకుండా జాగ్రత్త పడాలని వెల్లడించింది. అలాగే కలుషితమైన కలుషితమైన పాత దుస్తులను తొలగించి వెంటనే స్నానం చేయాలని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ జాగ్రత్తలు చెప్పింది.