'కంగారు పడొద్దు..నెక్ట్స్ నువ్వే'.. రచయిత్రికి బెదిరింపులు
భారతదేశంతో మూలాలున్న ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై తాజాగా అమెరికాలో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సల్మాన్ రష్దీని పలువురు ఆసుపత్రిలో చేర్పిచడంతో, పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. ఈ ఘటనతో ఆయా దేశాల్లో ఉన్న ప్రముఖ రచయితల్లో ఒక్కసారిగా కలవరం రేగింది. ఈ క్రమంలో బ్రిటిష్ నవలా రచయిత్రి జేకే రౌలింగ్(57)కు పాకిస్తాన్‌కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది ట్విట్టర్ వేదికగా బెదిరించడం మొదలుపెట్టడంతో సంచలనంగా మారింది.
.@TwitterSupport any chance of some support? pic.twitter.com/AoeCzmTKaU
— J.K. Rowling (@jk_rowling) August 13, 2022
వివరాల్లోకి వెళ్తే.." హ్యారీ పోర్టర్ నవలా రచయితి జేకే రౌలింగ్.. శుక్రవారం అమెరికాలో సల్మాన్ రష్దీపై హత్యాయత్నం ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, ‘తీవ్ర వేదనకు గురయ్యాను. ఆయన క్షేమంగా ఉండాలి’ అని ట్వీట్ చేశారు. దీనిపై కరాచీకి చెందిన మీర్ ఆసిఫ్ అజీజ్ అనే వ్యక్తి స్పందిస్తూ..‘కంగారు పడొద్దు. తర్వాత నువ్వే’అంటూ ట్విట్ చేశాడు. ప్రస్తుతం అతడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మీర్ ఆసిఫ్ అజీజ్ బెదిరింపు వ్యాఖ్యలపై జేకే రౌలింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించినా పోలీసులు..సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త, విద్యార్థిగా తనకు తాను పేర్కొనే ఆసిఫ్ అజీజ్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి మద్దతుగా పోస్టులు పెడుతాడని అధికారులు పేర్కొన్నారు. అతని దృష్టిలో భారత్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌లు ఉగ్రవాద దేశాలని, వాటిని ఎలా నాశనం చేయాలనే దానిపై కుళ్లు జోకులు వేస్తుంటాడని చెప్పారు. పేర్కొన్నారు.