కంగారు పడకండి కేంద్రమే కొంటుంది: బండి సంజయ్ - MicTv.in - Telugu News
mictv telugu

కంగారు పడకండి కేంద్రమే కొంటుంది: బండి సంజయ్

March 22, 2022

bn

తెలంగాణ రాష్ట్రంలో పండించే వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొంటుందని మంగళవారం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఢీల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..”రైతులకు అండగా నిలిచేది బీజేపీనే. రాష్ట్రంలోని సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలన్నీ తప్పు. అన్ని రాష్ట్రాల్లో కొంటున్నట్లే తెలంగాణలోనూ కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తుంది. కాబట్టి కంగారు పడకండి. గతంలో కొనుగోలు కేంద్రాలను మూసివేస్తామన్న సీఎం.. ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని ఎలా అడుగుతున్నారు. రైతులపై కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు” అని బండి సంజయ్ అన్నారు.

మరోపక్క కేసీఆర్ సోమవారం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో భాగంగా కేసీఆర్ యాసంగి వరి విషయంలో కేంద్రంతో యుద్ధం చేయడానికి సిద్దమైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ వరి విషయంలో కేంద్రమే వరిని కొంటుందని స్పష్టం చేశారు.