తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రిలీవ్ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని, ఈ నెల 12 లోపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని డీవోపీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్‌ను ఏపీ కేడర్‌కి కేటాయించగా, తెలంగాణలో కొనసాగేలా కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసి గతంలో క్యాట్ నిర్ణయం తీసుకుంది. దాంతో ఇన్నాళ్లూ సోమేష్ కుమార్ తెలంగాణలో కొనసాగుతూ వచ్చారు. అయితే క్యాట్ ఉత్తర్వులపై కేంద్రం 2017లో హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోమేష్ కుమార్ తప్పనిసరిగా ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడగా, ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించి డిప్యుటేషన్‌పై తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి చర్చించడానికే మంగళవారం సోమేష్ కుమార్ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.