కరోనా లాక్డౌన్ల తర్వాత భారీ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఇప్పటికే నాటు నాటు, కొమ్మా ఉయ్యాలా పాటల వీడియోలు వచ్చాయి. తాజాగా దోస్తీ సాంగ్ వీడియోను విడుదల చేశారు.
ఇద్దరు హీరోల మధ్య చిగురించిన స్నేహానికి ప్రతీకగా ఉన్న ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. దివంగత సీతారామశాస్త్రి రచించిన ఈ పాటకు కీరవాణి సంగీతం అందించారు. కాగా, సినిమాలో బాగా ఫేమస్ అయిన ‘కొమురం భీముడో’ పాట వీడియోను చివరగా విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.