ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రముఖ నగరాలైన విజయవాడ – విశాఖపట్టణం మధ్య డబుల్ డెక్కర్ రైలు మళ్లీ ప్రయాణించనుంది. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ రైలు పట్టాలెక్కనుండగా.. ఈ రైలు విశాఖపట్టణం నుంచి తెల్గవారుజామున 5.25 గంటలకు బయలుదేరి అదే రోజు ఉదయం 11.10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు స్టేషన్లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 10. 55 గంటలకు విశాఖ పట్టణం చేరుకుంటుంది. మరోవైపు గుంటూరు – డోన్ పట్టణాల మధ్య రెండు రైళ్లను పునరుద్ధరిస్తున్నారు. ఈ రైలు గుంటూరులో మధ్యాహ్నం 1 గంటకు బయల్దేరి అదే రోజు రాత్రి 9.15 గంటలకు డోన్ చేరుకుంటుంది. దారిలో పేరేచర్ల, ఫిరంగిపురం, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంబం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, పాణ్యం, కృష్ణమకోన, బీ సిమెంట్ నగర్, బేతంచర్ల, రంగాపురం, మల్కాపురం స్టేషన్లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో డోన్ నుంచి ఉదయం 6.30 గంటలకు బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు చేరుకుంటుంది.