రఫేల్ యుద్ధవిమానాలకు పావురాల వార్నింగ్!  - MicTv.in - Telugu News
mictv telugu

రఫేల్ యుద్ధవిమానాలకు పావురాల వార్నింగ్! 

July 9, 2019

Doves issue at ambala rafale fighter jets  ....

త్వర‌లో ఫ్రాన్స్ నుంచి భార‌త్ వాయుసేనకు అంద‌నున్న ర‌ఫెల్ యుద్ధ విమానాల‌ను అంబాలా ఎయిర్ వింగ్ స్థావ‌రానికి త‌ర‌లించ‌నున్నారు. వ‌చ్చే ఏడాదికి ర‌ఫెల్ యుద్ధవిమానాలు అంబాలా వాయుసేన స్థావ‌రానికి రానున్నాయి. అక్కడి 17వ స్క్వాడ్ర‌న్ విభాగంలో వీటిని ఉంచుతారు. అయితే ఇప్పుడు వారికి ఓ కొత్త చిక్కు వ‌చ్చి ప‌డింది. స్థావ‌రం చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లోని ప్ర‌జ‌లకు ఎప్ప‌టి నుంచో పావురాలు పెంచ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ది. దీంతో వంద‌ల కొద్దీ పావురాలు గాల్లో తిరుగుతున్నాయి. ఇదే ఇప్పుడు అధికారుల‌కు చిక్కుల్లో పెడుతోంది. యుద్ధవిమానాల రెక్క‌ల్లో పావురాలు చిక్కుకుంటే చాలా ప్ర‌మాదం.

ఇటీవల జాగ్వార్ యుద్ధవిమాన ఇంజ‌నులో పావురం చిక్కుకుంది. దీంతో ఇంజ‌న్ ఆగిపోవ‌డంతో పైలెట్ల ప్రాణాల‌కు ప్ర‌మాదం ఏర్ప‌డింది. విమానాన్ని పైలట్ కింద‌కు దింప‌డం కుద‌ర‌లేదు. బయటి ఇంధ‌న ట్యాంక్, ప‌ది కిలోల బ‌రువైన డ‌మ్మీ బాంబుల‌ను నేల మీద‌కు జారవిడిచారు. ఆ త‌ర్వాత విమానం బ‌రువు ద‌గ్గ‌డంతో అతిక‌ష్టం మీద దాన్ని ల్యాండ్ చేశారు. ముందు ముందు ర‌ఫెల్ యుద్ధవిమానాల విష‌యంలో ఏం జ‌రుగుతుందో అన్న భ‌యం ఇప్పుడు అధికారుల‌ను వేధిస్తోంది. దీంతో పావురాల పెంప‌కాన్ని ఆపాల‌ని ప్ర‌జ‌ల‌ను కోర‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని అధికారులు భావిస్తున్నారు. అయితే వారి మాట‌ల‌ను జ‌నం ఏ మేర‌కు వింటారో అన్న‌దే పెద్ద అనుమానంగా మారింది.