Download Hall Tickets:TSPSC has announced that the written test will be conducted on 5th March
mictv telugu

833 పోస్టులు.. రేపు టీఎస్‌పీఎస్‌సీ హాల్‌టికెట్ల జారీ

February 26, 2023

Download Hall Tickets:TSPSC has announced that the written test will be conducted on 5th March

వివిధ ఇంజనీరింగ్‌ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఇంజనీర్‌, మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల(మొత్తం 833 పోస్టులు) కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 5వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మార్చి 5వ తేదీన ఉదయం 10గంటల నుంచి 12.30 గంటల దాకా, మళ్లీ మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పరీక్ష ఉంటుందని గుర్తు చేసింది. ఈ పోస్టుల కోసం ఫిబ్రవరి 27న అంటే రేపు హాల్ టిక్కెట్‌ను విడుదల చేయనుంది టీఎస్‌పీఎస్సీ. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..
– టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
– హోమ్‌పేజీలో అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి
– మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి
– మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై చూడండి.
– అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.