నీట్ పీజీ 2023 ప్రవేశ పరీక్ష వాయిదా వేయడంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS)ఎట్టిపరిస్థితిలో పరీక్ష నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే పీజీ అడ్మిట్ కార్డును జారీ చేసింది. నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ natboard.edu.in Areకి లాగిన్ అయి అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ దశల్లో NEET PG అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి:
ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ NEET PG అడ్మిట్ కార్డ్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ కు వెళ్లి లాగిన్ వివరాలను నమోదు చేయాలి. లాగిన్ అయిన తర్వాత, అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నీట్ పీజీ ప్రవేశపరీక్ష అడ్మిట్ కార్డ్ 2023 డౌన్‌లోడ్ చేసుకోమని సూచించినప్పటికీ…మార్చి 5న జరగనున్న ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌పై గందరగోళం కొనసాగుతోంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న కొంతమంది అభ్యర్థులు మాత్రమే 2-3 రోజుల తర్వాత ప్రవేశ పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈరోజు అంటే ఫిబ్రవరి 27న విచారణకు రానుంది. పరీక్షను నిర్ణీత తేదీన నిర్వహిస్తారని లేదా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మార్చి5న పరీక్ష నిర్వహిస్తారా లేదా అనేది కోర్టు తీర్పును వెలువడినకే తెలుస్తుంది.