నలుగురు చిన్నారులపై వరకట్న వేధింపుల కేసు - MicTv.in - Telugu News
mictv telugu

నలుగురు చిన్నారులపై వరకట్న వేధింపుల కేసు

October 30, 2019

Dowry case on four children in guntur

పట్టుమని పదేళ్లు కూడా లేని నలుగురు చిన్నారులపై వరకట్నం వేధింపుల కేసు నమోదైన సంఘటన గుంటూరులో చోటుచేసుకుంది. చంద్రాపురానికి చెందిన పొన్నెకంటి బిందుకి 29 నవంబర్ 2018లో ఆదరణ కుమార్‌తో పెళ్లయింది. భర్త, అత్తమామలు, ఆడపడుచులు, వారి భర్తలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఈ ఏడాది సెప్టెంబర్ 26న గుంటూరు పట్టణ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. 

పోలీసులు సెప్టెంబర్ 26న వారిపై ఐపీసీ సెక్షన్ 498ఏ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో 6, 6, 9, 11ఏళ్ల వయసుగల నలుగురు ఆడపడుచుల పిల్లలను కూడా నిందితులుగా పేర్కొనడం గమనార్హం. దాంతో పోలీసులు తమపై యాంత్రికంగా వ్యవహరించి కేసు నమోదు చేశారని.. తమపై కేసు కొట్టేయాలని చిన్నారులతోపాటు ఇతర నిందితులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ కేసును న్యాయస్థానం పరిశీలించి తీర్పు ఇవ్వనుంది.