కవిత్వ శిఖరం నేలకొరిగింది.. తెలంగాణ మాగాణంలో విరిసిన సాహిత్య కుసుమం ఇక తిరిగిరాని లోకాలకు పయనమైంది.. వేల పాటలు, వేనవేల కవితలు, విశ్వ వినీలాకాశాన్ని ముద్దాడిన అక్షర కుసుమాలు..
తెలుగు భాష గురించి రాసినా, తెలంగాణ యాస సొగసును కళ్ళకు కట్టాలన్నా.., ఆయనే రాయాలి, ఆయన కలమే కదలాలి.. ఆయన రాసిన పాటలు ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్సే.. హుర్ఫోం కా రాజా చల్ బసా ఆసుమాకి ఓర్.. ఇవాళ ఉదయం 7 : 30 గంటలకు తన స్వగృహంలో కన్ను మూసిన డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారికి మైక్ టీవీ ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది…