జోగిని కొడుకు… ఈ ప్రపంచాన్ని గెలిచాడు - MicTv.in - Telugu News
mictv telugu

జోగిని కొడుకు… ఈ ప్రపంచాన్ని గెలిచాడు

August 11, 2017

జోగిని కడుపున పుట్టిన జీవి ప్రపంచాన్ని గెలిచింది..కారుచీకట్లో ఉన్న అభాగ్యులకు కాంతిరేఖయింది..

సమాజనికి  అదర్శం అంటుంది… ఇంతకి ఎవరఅతను… ఎమిటా స్టోరీ…

జంగం చిన్నయ్య…నేటివ్ ఆఫ్ కొమ్మన్ పల్లి ,నిజామాబాద్ జిల్లా…ప్రస్తుతం ఉంటున్నది కెనడాలో..అక్కడి కార్లెటాన్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్.. అంతకుముందు  లండన్ యూనివర్సిటీ నుండి చరిత్రలో పిహెచ్ డి పట్టా తీసుకున్నాడు..ఢిల్లీ యూనివర్సిటిలో ఎమ్ ఫిల్ చేశాడు…దళిత సాహిత్యం,అణగారిన కులాల వెనుకబాటుపై ఎన్నో పరిశోధనలు చేశాడు..చిన్నయ్యను అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి.. అయితే ఏంటీ…ఎంతో మంది మేధావులు ఉన్నత శిఖరాలను అధిరోహించారు కదా…ఏంటీ స్పెషల్ అనుకోవచ్చు.. చిన్నయ్య అందరిలాంటివాడు కాదు…


జంగం చిన్నయ్య..తల్లి పేరు చిన్నుబాయ్…తండ్రెవరో తెలియదు…అవును చిన్నయ్య ఓ జోగిని కొడుకు..పాపిష్టి సమాజం తయారుచేసిన వ్యవస్థలో పురుడు పోసుకున్న అభాగ్యుడు..అమ్మ లాలనే తప్ప నాన్నంటే ఎవడో తెలియదు..జోగిని కడుపులో పుట్టిన చిన్నయ్య తలరాతను  ఆ బ్రహ్మ రాయలేదు..తల్లి చిన్నుబాయే రాసింది.. పాడు సమాజం తనపై వేసిన మలినం…కొడుక్కి అంటకూడదంటే చదువొక్కడే మార్గమనుకుంది..చిన్నయ్య బాగా చదువుకోవాలి…లోకమంతా మురిసిపోవాలి..ఇదీ చిన్నుభాయ్ కల…కాని కాలానికి కన్నుకుట్టింది…కొడుకు విజయాలను చూడనియ్యకుండా ఆ తల్లిని తీసుకుపోయింది..

తల్లి ఆశయమే లక్ష్యంగా  చిన్నయ్య బతికాడు..అమ్మ జ్ఞాపకమైన చెల్లెల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు.. బతకడానికి నాలుగు మెతుకులు కావాలి..అందుకోసం కూలి పని చేశాడు..గమ్యాన్ని చేరడానికి ఓ ఆయుధం కావాలి.. చదువు, బోధించు,సమీకరించు…అంబేద్కర్ ఇచ్చిన నినాదామే స్పూర్తి..ఏనాటికైనా ఆ ప్రపంచ మేధావి చదువుకున్న విశ్వవిద్యాలయంలోనే చదవాలి..టార్గెట్ స్పష్టంగా కనిపిస్తోంది…ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో ఇంటర్,నాగార్జునసాగర్ లో చిన్నయ్య డిగ్రీ కంప్లీట్ చేశాడు..హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఎమ్.ఏ హిస్టరీని పూర్తి చేశాడు..ఢిల్లీ జేఎన్ యూలో యంఫిల్ తరువాత ఉస్మానియాలో ఉద్యోగం చేశాడు.. యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో పిహెచ్ .డి సీటు సంపాదించాడు..ఇంటలెక్చువల్ అండ్ పొలిటికల్ రైటింగ్స్ ఎగైనెస్ట్ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీ (intellectual and political writings of Dalits against caste inequality)  సబ్జెక్ట్ ఎంచుకున్నాడు… ఫెలిక్స్ స్కాలర్ షిప్ తో డాక్టరేట్ ను పూర్తిచేశాడు..ఆ తరువాత పోస్ట్ డాక్టరేట్ కోసం అమెరికా పోయాడు..

జోగిని కొడుకు చదువుకోవడమా? అది కూడా ఖండాలుదాటి?అసంభవం…దాన్ని సంభవం చేశాడు చిన్నయ్య…ఇప్పుడు చిన్నయ్య ఓ విజేత…సప్తసముద్రాలు దాటి విశ్వయవనికపై సగర్వంగా నిలుచున్న సామాజిక శాస్త్రేవేత్త…ఒకప్పుడు ఈసడించుకున్న సమాజమే ఇప్పుడు చిన్నయ్యను చూసి గర్వపడుతోంది… కొమ్మన్ పల్లిలోని యువతకు చిన్నయ్య ఓ రోల్ మోడల్…

జంగం చిన్నయ్య గొప్పతనం ఏంటో తెలుసుకోవాలనుకుంటే గూగుల్ లో ఆయన పేరు టైప్ చేస్తే చాలు..గెలుపు కెరటం కనిపిస్తుంది..తండ్రి పేరు లేకుండా ఇంతటి విజయం సాదించడం భారతదేశంలో ఓ అరుదైన సన్నివేశం.జీవిత సంఘర్షణలో అనేక అటుపోట్లను తట్టుకుని గెలిచి నిలిచిన జంగం చిన్నయ్య చాలా మందికి అదర్శమంటున్నారు .

చిన్నయ్య జీవితంలో ఆయన సహచరి మయూరిక చక్రవర్తి రోల్ చాలా గోప్పది…తన భార్యే తనకు వెన్ను దన్ను అని గర్వంగా చేబుతాడు చిన్నయ్య..ఢిల్లీ జేఎన్ యులో పరిచయమైన మయూరిక కాల క్రమంలో సహచరిగా మారింది..వీరికి ఓ కొడుకు..అతని పేరు అభ్యుదయ్ జంగం…సమాజంలో అంతరాలు పోవాలంటే చదువొక్కటే మార్గమన్నది చిన్నయ్య నమ్మకం.

మొన్నామధ్య చావుబతుకుల మధ్య ఉన్నఓ పెద్దమనిషికి చిన్నయ్యను చూడాలనిపించింది..ఆయన మరెవరో కాదు చిన్నయ్య పుట్టుకకు కారణమైన వ్యక్తి..ఆ మనిషి రమ్మన్నాడు..ఆఖరిదశలో ఆర్థికంగా ఆదుకోమన్నాడు.. నాన్నంటూ ఒకడుండాలి..వాడి భుజాలపై ఎక్కి ప్రపంచాన్ని గెలిచినంత సంబరపడాలి..వాడి గుండెల మీద తలవాల్చి అనిర్వచీనయమైన అనుభూతి పొందాలి..చిన్నయ్యకు ఈ ఆనందాలు కనీసం ఊహకు కూడా అందలేదు..పుట్టించినవాడు రమ్మన్నాడు..చిన్నయ్య వెళతాడు కాని ఒక కండీషన్.. నాన్నెవరో తెలియదన్న సమాజం ముందు కొడుకుగా ఒప్పుకోవాలి..బిడ్డగా గుండెకు హత్తుకోవాలి..కాని ఆ పెద్దమనిషికి  కావాల్సింది చిన్నయ్య కాదు..అందుకే ఒప్పుకోలేదు…

చిన్నయ్య…జోగిని కొడుకు…చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన ఓ వెలుగురేఖ…దుర్మార్గపు మనుషులు సృష్టించిన వ్యవస్థలో బతుకుతున్న ఎందరో అభాగ్యులకు స్పూర్తి..చిన్నయ్య లాంటి ఓ వ్యక్తి విజయగాథ…ప్రపంచానికి కొత్తదారి చూపిస్తుంది…