రెడ్డి ల్యాబ్స్‌పై సైబర్ దాడి. 5 దేశాల్లో ఉత్పత్తి బంద్  - MicTv.in - Telugu News
mictv telugu

రెడ్డి ల్యాబ్స్‌పై సైబర్ దాడి. 5 దేశాల్లో ఉత్పత్తి బంద్ 

October 22, 2020

ప్రముఖ ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌పై సైబర్ నేరగాళ్లు దాడి చేశారు. దాడి తీవ్రంగా ఉండడంతో ఐదు దేశాల్లోని ప్లాంట్లతో ఉత్పత్తి నిలిపేశారు. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా వెల్లడించింది. సైబర్ నేరగాళ్లు డేటా చోరీ చేశారని, భారీ నష్టం వాటిల్లిందని తెలిపింది, సమస్యను పరిష్కరిస్తున్నామని, రేపటికట్లా తిరిగి ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడించింది. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని, ఏ దేశం నుంచి దాడి జరిగిందో తెలియడం లేదని పేర్కొంది. 

సైబర్ దాడి కారణంగా మనదేశంతోపాటు అమెరికా, ఇంగ్లండ్, బ్రెజిల్, రష్యాల్లో రెడ్డీస్ ల్యాబ్స్ మూతపడ్డాయి. కరోనా వైరస్ నియంత్రణ కోసం రెడ్డీస్ సహా పలు ఫార్మా కంపెనీలు మందు తయారీకి యత్నిస్తున్న నేపథ్యంలో ఈ దాడి కలకలం రేపుతోంది. రష్యా తీసుకొచ్చిన ‘స్పుత్నిక్’ వ్యాక్సీన్‌ను మనదేశంలో పరీక్షించడానిక రెడ్డీస్‌ ఒప్పందం చేసుకుంది. టీకా పనితీరుపై సందేహాలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ట్రయల్స్‌కు అనుమతి నిరాకరించింది.