సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. బుల్లితెర నుంచి వెండితెర వరకు ఎదిగిన యువ హీరో. ఎన్నో ఆశలతో తనదైన టాలంటుతో పరిశ్రమలో ఎదిగాడు. ముఖ్యంగా ధోనీ జీవిత్ర కథ ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్ ధోనీ చిత్రంలో నటన ద్వారా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు పాపులర్ హీరోయిన్ అయిన కియారా అద్వానీ ఈ చిత్రం ద్వారానే పరిచయం అయ్యింది. ఆ సినిమా విజయంలో అందరి కళ్లూ సుశాంత్ వైపు తిరిగాయి. అతడితో సినిమాలు చేసేందుకు ప్రముఖ దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరిచారు. అయితే కెరీర్లో ఎదిగే కీలక సమయంలో ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్లో కలకలం రేపింది. డ్రగ్స్ కి బానిస అయ్యాడని, రిచా చద్దాతో ప్రేమ వ్యవహారం కారణమని, సుశాంత్ ఎదుగుదల తట్టుకోలేక బాలీవుడ్ ప్రముఖులు మానసిక క్షోభకు గురి చేయడంతో సూసైడ్ చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. చాలామంది వాటినే నిజమని భావించారు. కానీ అదంతా అబద్ధమని, సుశాంత్ ని హత్య చేశారని చెప్తున్నారు ఆయనకి పోస్టుమార్టం చేసిన డాక్టర్. సుశాంత్ మరణించి రెండేళ్లయినా విచారణ ఇంకా పూర్తి కాకపోయినా పోస్టుమార్టం చేసిన కూపర్ ఆస్పత్రి డాక్టర్ రూప్ కుమార్ షా అతని గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘సుశాంత్ చనిపోయినప్పుడు అతనితో పాటు మరో నాలుగు శవాలు పోస్టుమార్టం కోసం వచ్చాయి. అందులో ఒకటి వీఐపీది అని చెప్పారు. కానీ సుశాంత్ ని మేం గుర్తుపట్టాం. అతని శరీరంపై రెండు మూడు గుర్తులున్నాయి. పోస్టుమార్టంను వీడియో రికార్డ్ చేయాల్సి ఉండగా, ఉన్నతాధికారులు కేవలం ఫోటోలు మాత్రమే తీయమని చెప్పారు. వారి ఆదేశానుసారం మేం కూడా అలానే చేసి రాత్రిపూట పోస్టుమార్టం చేశాం. అటు అధికారులకు కూడా ఇది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పాం. కానీ వారు రూల్స్ ప్రకారం చేయమని చెప్పారు. తొందరగా బాడీ పోస్టుమార్టం చేసి తమకు అప్పగించాలని పోలీసులు చెప్పారు’ అని చెప్పడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి దీంతోనైనా దర్యాప్తు హత్యకోణంలో జరుగుతుందేమో చూడాలి. కాగా, జూన్ 14 2020లో సుశాంత్ ముంబైలోని తన అపార్ట్ మెంట్లో చనిపోయాడు. మరణంపై కొన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేయగా, ఆ ప్రభావం ఇప్పటికీ బాలీవుడ్ ని వదల్లేదు. అప్పటినుంచి బాలీవుడ్ సినిమాలు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో బాలీవుడ్ సినిమాల బహిష్కరణ ట్రెండింగ్ నేటికీ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
ఎంత బిజీగా ఉన్నా ప్రతీ వేసవికి సొంతూరుకు చలపతి రావు
అనుపమతో డ్యాన్స్ ఇరగదీసిన అల్లు అరవింద్, సుకుమార్.. (వీడియో)