'Dragon Girl' who transformed herself with 600 tattoos worth 250,000 dollars
mictv telugu

గ్యాప్ అనేదే ఉండకూడదట.. బాడీ మొత్తం టాటూలే

July 11, 2022

'Dragon Girl' who transformed herself with 600 tattoos worth 250,000 dollars

దేవుడా.. ఫోటోలోని ఈ అమ్మాయి గురించి తెలిస్తే షాకవుతారు. పచ్చబొట్టు పొడిపించుకోవడం ప్రెజెంట్ యూత్ ట్రెండే కానీ.. గ్యాప్ లేకుండా టాటూ వేయించుకోవడం ఈ అమ్మడికే చెల్లిందే. శరీరంలో 98 శాతం టాటూలే. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన అంబర్ ల్యూక్ అనే మోడల్.. టాటూ మహిళగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. బాడీలో ‘ఇంచు గ్యాప్ లేకుండా.. ఇంక్ చేయించడమే లక్ష్యం’ అంటూ అందులో తనకు ఎన్ని కష్టాలొచ్చినా వెనక్కి తగ్గేదేలేదని తేల్చిచెప్పింది. కళ్లు పోయినా పర్వాలేదు.. ‘ఐ బాల్’కు టాటూ వేయించుకుంటానని పట్టుబట్టిన మోడల్.. ఐదేళ్ల క్రితమే ఆ పని చేసేసింది. డాక్టర్స్‌ ముందుగా చెప్పినట్లుగానే కొద్ది రోజులు అంధురాలిగా బాధలను ఎదుర్కొంది. ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

'Dragon Girl' who transformed herself with 600 tattoos worth 250,000 dollars

‘ఐ బాల్స్‌లోకి సిరంజి ఇంజెక్షన్లు ఇవ్వడమనేది టార్చర్ ప్రాసెస్. పది గాజు ముక్కలు పట్టుకుని నా కంటికి రుద్దినట్లు అనిపించింది. బ్లూ కలర్ కన్నీరు రాల్చడం నా ఒక్కదానికే సొంతమైందేమో. అయినా నాకు ఎలాంటి రిగ్రెషన్ లేదు’ అని పేర్కొంది. ఇక ఏడేళ్ల బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో 600 టాటూలు వేయించుకున్న అంబర్.. ఇందుకోసం ఏకంగా రూ.2 కోట్లు వెచ్చించడం విశేషం.