Draupadi Murmu lead in the presidential election
mictv telugu

రాష్ట్రపతి ఎన్నిక : ముర్ముకు భారీ ఆధిక్యం.. రెడీగా 20 వేల లడ్డూలు

July 21, 2022

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల కౌంటింగ్ గురువారం జరుగుతుండగా, తొలిరౌండ్ ఫలితాలను రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. ఇప్పటివరకు ఎంపీల ఓట్లు లెక్కించగా, ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు, విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు పోలయినట్టు ప్రకటించారు. మొత్తం 763 మంది ఎంపీలు ఓటు వేయగా, 15 ఓట్లు చెల్లలేదు. ఓట్ల విలువ ప్రకారం చూస్తే ముర్ముకు 3,78,000, యశ్వంత్‌కు 1,45,600గా ఉంది. తర్వాత ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించిన తర్వాత తుది ఫలితాలను వెల్లడిస్తామని వివరించారు. ఇదిలా ఉండగా, ద్రౌపది ముర్ము విజయం ఖాయంగా కనిపిస్తుండడంతో ఆమె స్వగ్రామమైన ఒడిషాలోని ఉపెర్బెడాలో సంబరాలకు ప్రజలు సిద్ధమయ్యారు. గెలుపు ప్రకటన రాగానే గ్రామస్థులకు పంచడానికి 20 వేల లడ్డూలను రెడీగా ఉంచారు. ఆ ఊర్లో ఆమె తల్లిదండ్రులు ఒకప్పుడు నివాసం ఉండగా, ఇప్పుడు ఆ ఇంట్లో ముర్ము మేనల్లుడు నివసిస్తున్నారు.