నేడే ద్రౌపది ముర్ము నామినేషన్.. - MicTv.in - Telugu News
mictv telugu

నేడే ద్రౌపది ముర్ము నామినేషన్..

June 24, 2022

భారతదేశ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి విపక్షాలు, అధికార పార్టీల నాయకులు తమ పార్టీ తరుపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలని అనే విషయంపై సుధీర్ఘంగా చర్చలు జరిపారు. తాజాగా ఎన్డీఏ తరుపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించారు. విపక్షాల తరుపున రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించారు. ఈ క్రమంలో శుక్రవారం 10:30 గంటలకు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము నామినేషన్ వేయనున్నారు. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు సిద్దమైయ్యాయి.

ద్రౌపది ముర్ము నామినేషన్ సందర్భంగా ఎన్డీఏ ముఖ్యమంత్రులు అందరు వెంటనే ఢిల్లీకి రావాలని బీజేపీ అధిష్టానం ఆహ్వానం పంపింది. ఇక, ఇవాళ నామినేషన్ వేసే సమయంలో ద్రౌపది ముర్ము వెంట ప్రధాని మోదీతోపాటు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఉండేలా అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 50 మంది ఎంపీలు సంతకాలు చేయనున్నారు. ఇందుకోసం బీజేపీ, మిత్రపక్షాల ఎంపీలు ఢిల్లీలో మకాం వేశారు. ఈ క్రమంలో ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు.