ద్రౌపది ముర్ముకే వైసీపీ మద్దతు: జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

ద్రౌపది ముర్ముకే వైసీపీ మద్దతు: జగన్

June 24, 2022

”దేశ చరిత్రలో రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారిగా గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ముకు అవకాశం ఇవ్వడం శుభ పరిణామం. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకే వైసీపీ మద్దతు” అని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకుంది. మంత్రివర్గ సమావేశం కారణంగా నేడు జగన్.. రాష్ట్రపతి అభ్యర్థిగా నేడు ద్రౌపది ముర్ము నామినేషన్‌ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నారు అని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. వైసీపీ తరుపున నేడు ఢిల్లీలో ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమానికి వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభలో పార్టీ పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి పాల్గొననున్నామని తెలిపారు.

మరోపక్క ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ ముఖ్యమంత్రులు ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే బీజేపీ, మిత్రపక్షాల ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. నేడు ద్రౌపది ముర్ము నామినేషన్ సమయంలో ఆమె వెంట మోదీతోపాటు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి కూడా పాల్గొనాలని పిలుపురాగా, వైసీపీ తరుపున నామినేషన్ కార్యక్రమంలో వి.విజయసాయిరెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి పాల్గొనున్నట్లు వైసీపీ అధిష్టానం పేర్కొంది.