ద్రౌపది మొండిది.. ఆమె వల్లే 18 లక్షలమంది చనిపోయారు.. - MicTv.in - Telugu News
mictv telugu

ద్రౌపది మొండిది.. ఆమె వల్లే 18 లక్షలమంది చనిపోయారు..

December 18, 2017

పాండవుల భార్య ద్రౌపది మొండితనం వల్లే మహాభారత యుద్ధం జరిగి, 18 లక్షల మంది చచ్చిపోయారని బీజేపీ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  రాంమాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏనాడూ భర్తల మాట వినలేదని, ప్రపంచంలో ఆమెనే తొలి ఫెమినిస్ట్ అని పేర్కొన్నారు. ఆయన ఆదివారం పనాజీలో నిర్వహించిన ఇండిక్ ఫెస్టివల్‌లో ప్రసంగించారు.
‘ద్రౌపదికి ఐదుగురు భర్తలు.. కానీ ఆమె ఆమె ఎప్పుడూ వారి మాట వినలేదు.. తన స్నేహితుడైన శ్రీకృష్ణుడు ఏ చెబితే దాన్నే వేదవాక్కుగా పాటించింది. కానీ ఆమె స్వైరిణి అని మనం అనకూడదు. మహాభారత యుద్ధానికి ఆమె మొండి పట్టుదలే ఏకైక కారణణం.. ఆ యుద్ధంలో ఏకంగా 18 లక్షల మంది చనిపోయారు… ’ అని అన్నారు. అయితే ద్రౌపది మొండిపట్టుదల ఏమిటో ఆయన వివరించలేదు.