ద్రౌపది ముర్ముకు ఓటు వేయను: నరసింగ మిశ్రా - MicTv.in - Telugu News
mictv telugu

ద్రౌపది ముర్ముకు ఓటు వేయను: నరసింగ మిశ్రా

June 24, 2022

 

ఒడిశా కాంగ్రెస్ సీనియర్ నేత, శాసనసభా పక్ష నేత నరసింగ మిశ్రా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”ద్రౌపది ముర్ము మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళ. మంచి వక్త. ఆమెతో కలిసి నేను ఐదేళ్లపాటు శాసనసభలో పని చేశాను. కానీ, ఆమె బీజేపీ, ఆరెస్సెస్ విధానాలకు ద్రౌపది ప్రాధాన్యం ఇస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమెకు ఓటు వేసే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ అధిష్ఠానం మేరకు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే నేను ఓటు వేస్తాను” అని ఆయన అన్నారు.

నరసింగ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఎన్డీఏలో హాట్ టాఫిక్‌గా మారాయి. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఓవైపు ప్రశంసల వర్షం కురిపిస్తూనే, బీజేపీ, ఆరెస్సెస్ విధానాలకు ద్రౌపది ప్రాధాన్యం ఇస్తారని, ఆమెకు ఓటు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. మరోవైపు ద్రౌపది ముర్ము నామినేషన్‌కు సర్వం సిద్దమైంది. ఇప్పటికే ఎన్డీఏ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఆమె వెంట నామినేషన్ కార్యాలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఒడిశా కాంగ్రెస్ సీనియర్ నేత నరసింగ మిశ్రా ఆమె వ్యక్తిత్వం గురించి ప్రస్తావిస్తూ, ఓటు వేయనని స్పష్టం చేశారు.