ఐపీఎల్ ప్రియులకు షాక్.. ఏపీలో డ్రీమ్ 11 బ్యాన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఐపీఎల్ ప్రియులకు షాక్.. ఏపీలో డ్రీమ్ 11 బ్యాన్

September 30, 2020

nmvb mn

దేశవ్యాప్తంగా ఐపీఎల్ జోష్ నడుస్తోంది. చాలా మంది క్రికెట్ ప్రియులు డ్రీమ్ 11లో మునిగిపోయి మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తున్నారు. కొంత మంది అయితే మ్యాచ్‌తో పాటు బెట్టింగులు కూడా కాస్తున్నారు. అలాంటి వారికి ఏపీ ప్రభుత్వం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. దానిపై నిషేధిం విధించడంతో పెయిడ్ కంటెస్ట్‌లో జాయిన్ కాలేకపోతున్నారు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు స్పందిస్తున్నారు. ఉన్నట్టుండి ఈ యాప్ పని చేయకపోవడంతో అందులో ఉన్న బ్యాలెన్స్ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

గేమింగ్ యాక్ట్‌లో సవరణలో భాగంగా డ్రీమ్ 11 పై నిషేధం విధించారు. అయితే దీంట్లో మ్యాచ్‌లు ఉచితంగా చూసే వారికి మాత్రం ఇబ్బంది లేదు. డబ్బులు కట్టి కాంటెస్ట్‌లో పాల్గొనేందుకు అవకాశం లేదు. ఇప్పటికే తెలంగాణ, అస్సాం,నాగాలాండ్, సిక్కింలో ఈ చట్టాలు అమలులో ఉన్నాయి.  దీంతో ఏపీలోని క్రికెట్ ప్రియులు పే టూ ప్లే ఫార్మట్‌ లేక ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.ఈ నిర్ణయానికి పలువురు మద్దతు పలుకుతున్నారు. అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకుండా కట్టిడి అవుతుందని అంటున్నారు. కాగా, ఐపీఎల్ 2020 సీజన్ స్పాన్సర్‌గా ఈసారి డ్రీమ్ 11 అవకాశాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే.