dress matching fabric jewellery
mictv telugu

ఫ్యాబ్రిక్ జ్యులరీ…ఇదే ఇప్పుడు ట్రెండ్

February 20, 2023

dress matching fabric jewellery

ఆభరణం అంటే..మనకు బంగారం, వెండి ఇతర లోహాలతో చేసిన నగలే కళ్ళ ముందు నిలుస్తాయి. అలా కాకుండా డ్రెస్‌ కలర్‌లో ఉండే ఫ్యాబ్రిక్‌ జ్యులరీ ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది. డ్రెస్‌ ఫ్యాబ్రిక్‌నే నగల మేకింగ్‌లోనూ వాడుతూ ఆభరణాలను రూపొందించుకోవడంపై దృష్టి పెడుతోంది నేటి తరం.

డ్రెస్‌ను పోలినట్టుగా ఉండే చెప్పులు, హ్యాండ్‌ బ్యాగ్‌ ట్రెండింగ్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు డ్రెస్‌లోని మెటీరియల్‌తోనే ఆభరణమూ ధరిస్తే… ఆ అందం ఇనుమడిస్తుందని నేటి వనితల ఆలోచన. అందుకే ఇలా ఫ్యాబ్రిక్‌తో రకరకాల ఆభరణాలు తయారు చేస్తున్నారు. ఒకేరంగులో చిన్న చిన్న మార్పులతో ఉండే ఈ ఆభరణాలు క్యాజువల్‌ వేర్‌గానూ, ఫ్యాషన్‌వేర్‌గానూ అందుబాటులోకి వస్తునన్నాయి. లేదా చీరకు జాకెట్ కుట్టించుకున్నప్పుడు స్వయంగా తామే నగలను కూడా కుట్టించకుకుంటున్నారు.

జరీ జిలుగులూ ఎంబ్రాయిడరీ మెరుగులు

ఫ్యాబ్రిక్‌ దుస్తుల మీద ఎంబ్రాయిడరీ సొగసు గురించి మనకు తెలిసిందే. పట్టుచీరల అంచుల అందమూ పరిచయమే. ఎంబ్రాయిడరీ డ్రెస్‌ లేదా జరీ చీర పాతదైపోయిందని పక్కన పెట్టేసేవారు వాటి అంచులను జాగ్రత్తగా కట్‌ చేసి, ముచ్చటైన ఆభరణాలను రూపొందించుకోవచ్చు.వీటి తయారీకి కావల్సింది నచ్చిన క్లాత్, గట్టి ఫ్యాబ్రిక్, గమ్‌ లేదా సూదీ దారం, ఇయర్‌ హుక్స్‌… సెట్‌ చేసుకుంటే చాలు. కావల్సిన డిజైన్‌లో ఆభరణాలను రూపొందించుకొని డ్రెస్‌కు తగిన విధంగా ధరించవచ్చు.

వందల రూపాయల్లో అందరికీ అందుబాటులో ఉండే ధరలలో ఆకట్టుకునే ఈ ఆభరణాలు అన్ని వయసువారికీ ముఖ్యంగా కాటన్‌ డ్రెస్సులు, చీరల మీదకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.వెస్ట్రన్‌ వేర్‌ మీదకూ వినూత్నంగా వెలిగిపోతున్న ఫ్యాబ్రిక్‌ జ్యువెలరీ మేకింగ్‌ కూడా సులువుగానే ఉండటంతో నేటి మహిళ విభిన్న రకాల డిజైన్స్‌లో ఫ్యాబ్రిక్‌ ఆభరణాలను తీర్చిదిద్దుతోంది. ఫ్యాబ్రిక్‌ను మెడకు హారంగా, చెవులకు హ్యాంగింగ్స్‌లా సెట్‌ చేశాక మరిన్ని ఆకర్షణలు జోడించాలంటే ఏదైనా లోహాన్ని జత చేయచ్చు. అందుకు జర్మన్‌ సిల్వర్, ట్రైబల్‌ జ్యువెలరీ పీసెస్‌ను ఎంపిక చేసుకొని ఫ్యాబ్రిక్‌ జత చేయచ్చు.