భారత వస్త్రధారణలో నోబెల్ అందుకున్న అభిజిత్ బెనర్జీ - MicTv.in - Telugu News
mictv telugu

భారత వస్త్రధారణలో నోబెల్ అందుకున్న అభిజిత్ బెనర్జీ

December 11, 2019

3

ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో నోబెల్ పురస్కారం భారత సంతతికి చెందిన అభిజీత్ బెనర్జీని వరించిన విషయం తెలిసిందే. అభిజీత్‌తో పాటు ఆయన భార్య ఎస్తేర్ డఫ్లో కూడా ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. నోబెల్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం స్వీడన్‌లోని స్టాక్‌హోంలో జరిగింది. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమానికి అభిజీత్ దంపతులు భారత వస్త్రధారణలో వచ్చారు. స్వీడన్ రాజు కార్ల్ గుస్తాఫ్‌ చేతులు మీదుగా బహుమతి అందుకున్నారు.

 అభిజీత్ నల్లటి బంధ్‌గాలా ధరించి దానిపైకి తెల్లడి ధోవతి ధరించగా.. ఎస్తేర్ డఫ్లో నీలం రంగు చీరలో కనిపించారు. ఆర్థికశాస్త్రంలో వీరు చేసిన కృషిని గుర్తిస్తూ నోబెల్ పురస్కార సంస్థ నోబెల్ బహుమతిని ప్రకటించింది. ఇందులో భాగంగా ఒక మెడల్‌ను రాజు గుస్తాఫ్ ప్రదానం చేశారు. స్వీడిష్ కరెన్సీలో 9 మిలియన్ స్వీడిష్ క్రోనా అంటే భారత కరెన్సీలో రూ.6.7 కోట్లు బహుమతి కింద ఇవ్వడం జరిగింది. అభిజీత్ బెనర్జీ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని పొందిన రెండో భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అంతకుముందు ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ ఈ ప్రతిష్టాత్మక బహుమతిని అందుకున్నారు. కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో వీరిద్దరూ చదవడం గమనార్హం.