చైనాకు చెందిన దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. సదరు కంపెనీ పన్ను ఎగవేసినట్లు వచ్చిన ఆరోపణలపై డేగ కన్ను వేసింది. పన్ను ఎగవేత ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) దర్యాప్తు చేయగా వివో రూ.2,217 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేసినట్లు తేలింది. దర్యాప్తులో భాగంగా డీఆర్ఐ అధికారులు వివో కంపెనీ ఫ్యాక్టరీలో సోదాలు జరిపారని, దిగుమతులకు సంబంధించి కంపెనీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు లెక్కలు చూపిందనడానికి సోదాల్లో సాక్ష్యాలు లభించాయని ఆర్థిక శాఖ తన ప్రకటనలో పేర్కొంది. తప్పుడు లెక్కలు చూపడం ద్వారా కంపెనీ రూ.2,217 కోట్ల కస్టమ్స్ సుంకాల ఎగవేతకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
గత నెలలో కూడా వివో కంపెనీ స్థాపించిన 18 కంపెనీల్లో ఈడీ తనిఖీలు చేసింది. 2017-21 మధ్యకాలంలో రూ.62,476 కోట్ల టర్నోవర్‌ను చైనాలోని పేరెంట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసింది. మరోవైపు వివోతో పాటు ట్యాక్స్ ఎగవేతలకు సంబంధించి చైనాకు చెందిన ఒప్పొ, షావోమి లకు నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ కంపెనీలపై ఈడీ మాత్రమే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వంటి సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని వివరించారు.