డ్రంక్ అండ్ డ్రైవ్ కౌన్సిలింగ్‌..కారణాలు విని షాకైన పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

డ్రంక్ అండ్ డ్రైవ్ కౌన్సిలింగ్‌..కారణాలు విని షాకైన పోలీసులు

November 27, 2019

తాగుబోతులు అంటే ఎందుకంత చులకన.. మేం చె ప్పే ది పచ్చి నిజం అంటూ ట్రాఫిక్ పోలీసులకు చెప్పిన కారణాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు వింత కారణాలు విని అవాక్కయ్యారు. ఆఫీసు నుంచి తాగి ఇంటికి వెళ్లడానికి భార్యలు, లవర్స్, ఆఫీసులో బాసుల ఒత్తిడే కారణమని వారంతా ముక్తకంఠంగా చెప్పడం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. 

Drinkers Funny Reasons.

ఈ వీకెండ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వారికి బేగంపేట, గోషామహల్ ట్రాఫిక్ పోలీసుల కార్యాలయాల్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. దీంట్లో ఒక్కొక్కరుగా తాగడానికి కారణాలు వెల్లడించారు. అవాన్ని వినడానికి చాలా ఆసక్తిగా ఉన్నాయి. భార్య మాట్లాడకపోవడంతో తాగి వెళ్తున్నట్టు ఓ సాఫ్ట్ వెర్ ఉద్యోగి చెప్పాడు. తన గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి అంగీకరించలేదని ఓ యువకుడు. బాస్ సెలవు అడిగితే ఇవ్వలేదని మరొకరు ఇలా నోటికి వచ్చిన కారణాలు చెప్పారు. ఇంకా కొందరు అయితే తాగి వెళ్లడం ఇదే మొదటిసారి అని మరోసారి వెళ్లమంటూ ఒట్లు కూడా పెట్టారు. ఫ్రెండ్స్ కాలిశారని పార్టీ చేసుకున్నట్టు ఇలా మిడిల్ క్లాస్ కారణాలు పోలీసులకు వినిపించాయి. 

ఇక చేసేదేమి లేక ఎప్పటికలాగే పోలీసులు కూడా వారికి గంటసేపు ఆడియో, వీడియో ద్వారా రహదారి భద్రతా నియమాలు వివరించారు. మరోసారి జరిగితే కేసులు పెడతామని హెచ్చరించారు. తరుచూ పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరిచి జరిమానా పడేలా చేశారు. తాగి వాహనాలు నడపడం వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికైనా మందుబాబుల్లో మార్పు వస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.