పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన శరీరంలోని ఎముకలు బలంగా ఉండాలంటే ప్రతిరోజూ పాలు తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. పాలలో ఉండే క్యాల్షియం ఎముకలను బలంగా మారుస్తాయి. యాలకులు, పసుపు, బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల ఆరోగ్యం దృఢంగా ఉంటుందని మనందరికీ తెలుసు. అయితే మీరు ఎప్పుడైనా గసగసాలు కలిపిన పాలు తాగారా? పాలలో గసగసాలు కలుపుకుని తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. గసగసాల పాలలో మరిగించి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎముకలు బలంగా ఉంటాయి:
గసగసాలు, పాలలో చాలా కాల్షియం లభిస్తుంది. మీ ఎముకలు బలహీనంగా మారినట్లయితే, గసగసాలను పాలలో కలుపుకుని ప్రతిరోజూ రాత్రి త్రాగాలి. ఇది మీ ఎముకలను బలంగా మార్చుతుుంది. అలాగే కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది.
మంచి నిద్రకు:
నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే గసగసాల పౌడర్ ను పాలలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత పాలను తాగాలి. గసగసాల్లో ఉండే గుణాలు మంచి నిద్రకు తోడ్పతాయి. ఈ పాలను రాత్రి పడుకునేముందు తాగినట్లయితే ప్రశాంతమైన నిద్ర వస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి:
మీరు జీర్ణసంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే…గసగసాల పొడిని పాలలో వేసుకుని మరగించి తాగండి. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. గసగసాల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది.
దీనితో పాటు, గసగసాల పొడిని పాలలో మరిగించి ప్రతిరోజూ రాత్రి పడుకునే సమయంలో తీసుకోవడం వల్ల మీ అజీర్ణ సమస్య కూడా తొలగిపోతుంది.
కళ్లకు మేలు చేస్తుంది:
గసగసాలు పాలలో మరిగించి తాగడం వల్ల బలహీనమైన కళ్ళు కూడా పదునుగా మారుతాయి. జింక్, యాంటీఆక్సిడెంట్లు గసగసాలలో ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. దీనితో పాటు, ఇది అనేక వ్యాధుల నుండి కళ్లను కూడా రక్షిస్తుంది.
పాలలో గసగసాలు ఎలా ఉడికించాలి?
గసగసాలను నీటిలో అరగంట నానబెట్టండి. ఇప్పుడు బాణలిలో పాలు, గసగసాలు వేయాలి. దీన్ని 5-6 నిమిషాలు ఉడకబెట్టండి. ఇప్పుడు గ్లాసులోకి తీసుకుని పడుకునేటప్పుడు తాగాలి. పాలలో ఉడికించిన గసగసాలు రోజూ తింటే ఆరోగ్యం బాగుంటుంది.