విద్యార్ధులకు తాగునీరు బంద్.. తల్లిదండ్రుల అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

విద్యార్ధులకు తాగునీరు బంద్.. తల్లిదండ్రుల అరెస్ట్

June 16, 2022

బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో విద్యార్ధుల నిరసన మూడో రోజు కొనసాగుతోంది. విద్యార్ధులకు మద్దతుగా వచ్చిన వారి తల్లిదండ్రులు, బంధువులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషనుకి తరలించారు. అంతేకాక, పాటు ఆందోళన చేస్తున్న విద్యార్ధులకు అధికారులు తాగునీరు నిలిపివేశారు. దీంతో విద్యార్ధుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘మాపై ఒత్తిడి తేవడానికి ఈ రకంగా ప్రయత్నిస్తున్నారు. మా క్యాంపస్ మొత్తం ఎస్పీ కంట్రోల్‌లో ఉంది. వెంటనే తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను పునరుద్ధరించాల’ని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, విద్యార్ధులు తమ పట్టు వీడడం లేదు. డిమాండ్లపై కలెక్టర్ హామీ ఇచ్చినా ప్రజా ప్రతినిధులు స్పష్టమైన ఆచరణాత్మక హామీ ఇస్తే గానీ తమ ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని వారు తెగేసి చెప్తున్నారు. పోలీసులు మెయిన్ గేటు వరకు రాకుండా విద్యార్ధులను నిరోధించడంతో వారు రెండో గేటు వద్ద తమ నిరసనను తెలియజేస్తున్నారు.