Drishyam 3: Antony Perumbavoor confirms threequel of Mohanlal-Jeethu Joseph’s film,
mictv telugu

దృశ్యం పార్ట్ 3 ప్రకటించిన నిర్మాత.. వెయిటింగ్ అంటున్న ప్రేక్షకులు..

August 28, 2022

సినీ పరిశ్రమలో ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. హిట్ చిత్రాల కొనసాగింపుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కథ, కథనం బాగున్న వాటిని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన క్రైమ్-థ్రిల్లర్ ‘దృశ్యం’ రెండు భాగాలు సూపర్ హిట్ అయ్యాయి. జీతూజోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలు తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ రీమేక్ అవుతున్నాయి.

ఇప్పుడు ఈ చిత్రం మూడవ భాగంతో తిరిగి వస్తుందని నిర్మాత ఆంటోని పెరుంబవూర్ ఒక అవార్డుల కార్యక్రమంలో ప్రకటించారు. ట్రేడ్ ఎక్స్‌పర్ట్ మనోబాల విజయబాలన్ కూడా ఈ వార్తను ధృవీకరించారు. మూడో పార్టు కాన్సెప్ట్ లైన్ ను మోహన్‌ లాల్‌కు చెప్పగా ఆయనకు నచ్చిందని తెలుస్తోంది. దాంతో, మరో సీక్వెల్ కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. అనుకోకుండా జరిగిన ఓ హత్య చుట్టూ సాగే కుటుంబ కథలు ఇవి. హీరో తన సినిమా తెలివి తేటల్ని ఉపయోగిస్తూ పోలీసుల చేతికి దొరక్కుండా తన కుటుంబాన్ని కాపాడుకుంటూ రావడమే ఈ సినిమా స్టోరీ. ఈ కథకి ముగింపుగా మూడో భాగం సిద్ధమవుతోంది.

సూపర్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ దృశ్యం సినిమాకి మరో సీక్వెల్ ప్రకటించడంతో, ఇది కూడా జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలోనే తెరకెక్కనుండటంతో సినీ ప్రేమికులు, అభిమానులు ఈ పార్ట్ 3 కోసం వైట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే షూటింగ్‌కి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సారి ఇంకెన్ని ట్విస్టులతో డైరెక్టర్ ప్రేక్షకులని ఆకట్టుకుంటాడో చూడాలి.