చైనాలో రూ.1200 కోట్లు వసూలు చేసిన దృశ్యం రీమేక్ - MicTv.in - Telugu News
mictv telugu

చైనాలో రూ.1200 కోట్లు వసూలు చేసిన దృశ్యం రీమేక్

January 22, 2020

hbgh

భారత్‌లో చైనా ఫోన్ల హవా నడుస్తుంటే.. చైనాలో మాత్రం దక్షిణాది సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. అక్కడ రీమేక్ అయిన దృశ్యం సినిమా కాసుల వర్షాన్ని కురిపించింది. ఏకంగా రూ. 1200 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. రిమేక్ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. వూ షా (షీప్ వితౌట్ షిప్‌యార్డ్) అనే పేరుతో విడుదలైన ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టాడు నిర్మాత. 

మళయాలంలో మోహన్‌లాల్, తెలుగులో వెంకటేశ్ ఈ సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించి అందరితో ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాను చైనాలో దర్శకుడు  శామ్ క్వాహ్ షీప్ వితౌట్ షిప్‌యార్డ్పేరుతో తీశాడు. అక్కడి చట్టాలకు అనుగుణంగా సినిమాను తెరకెక్కించి ఓ మధ్య తరగతి తండ్రి పడే కష్టాలు చూపించడంలో సక్సెస్ అయ్యాడు. దీంతో ఆ సినిమా భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో గ్జియో యాంగ్ ప్రధాన పాత్ర పోషించాడు.గతేడాది డిసెంబరు 13న విడుదలైన ఈ సినిమా 168మిలియన్ డాలర్లు రాబట్టడం విశేషం. కాగా శ్రీలంకలోనూ ధర్మయుద్ధ అనే పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.