చొక్కా గుండీలు పెట్టుకోలేదని చలాన్ - MicTv.in - Telugu News
mictv telugu

చొక్కా గుండీలు పెట్టుకోలేదని చలాన్

September 25, 2019

driver challaned ......

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మోటార్ వెహికిల్ చట్టం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెల్సిందే. ఇక అప్పటి నుంచి కొత్త కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలుసుకునే అవకాశం దేశ ప్రజలకు కల్పిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. వింత వింత జరిమానలతో వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. కారులో ప్రయాణిస్తూ హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.. లుంగీతో లారీ నడిపాడని భారీ ఫైన్.. చివరకు కండోమ్ లేదని చలాన్ లాంటి వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా జైపూర్‌లో ట్రాఫిక్ పోలీసులు రాసిన చలానా ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అవుతోంది. చెప్పులు వేసుకుని.. చొక్కాకు గుండీలు పెట్టుకోలేదని ఓ ట్యాక్సీ డ్రైవర్‌కు రూ.1600 చలానా రాసి చేతిలో పెట్టారు ట్రాఫిక్ పోలీసులు. అయితే, జరిమానా కోర్టులో మరింత పెరుగుతుందని పోలీసులు తెలిపారు. దీంతో ట్యాక్సీ డ్రైవర్‌ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ నెల 6న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.