డ్రైవర్ లెస్ కార్లకు నో పర్మిషన్..! - MicTv.in - Telugu News
mictv telugu

డ్రైవర్ లెస్ కార్లకు నో పర్మిషన్..!

July 25, 2017

దేశంలో డ్రైవర్ లెస్ కార్లకు అనుమతివ్వ బోమని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. డ్రైవర్‌లెస్ కార్లతో డ్రైవర్లు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం డ్రైవింగ్ శిక్షణ ద్వారా 50 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. భారత్‌లో 22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రమోట్ చేస్తామన్నారు. మ్యాన్‌పవర్ లేకుండా పని చేసే టెక్నాలజీని తాము ఎప్పటికీ సమర్థించామని గడ్కరీ తేల్చిచెప్పారు. సో గడ్కరీ ప్రకటనతో డ్రైవర్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.