ఇక తాగి వాహనం నడిపితే.. ఉద్యోగం ఉష్ కాకి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇక తాగి వాహనం నడిపితే.. ఉద్యోగం ఉష్ కాకి..

May 8, 2019

తాగి వాహనాలు నడపొద్దని ట్రాఫిక్ పోలీసులు నెత్తినోరు మొత్తుకుని చెప్పినా.. మందుబాబుల ఆ మాటలను వినిపించుకోవడం లేదు. పూటుగా మందు కొట్టి, వాహనాలతో రోడెక్కి, ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. అంతేకాదు ఎదుటువాళ్లను కూడా ప్రమాదాల్లోకి నెడుతున్నారు. అలాంటి వారిలో ట్రాన్స్ కో లో కూడా అనేక మంది ఉన్నారట. అందుకే ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాగి వాహనాలు నడిపితే ఉద్యోగం ఊడిపోతుందని గట్టిగా హెచ్చరించారు. ఇప్పటికే ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

Driving alcohol and driving vehicles. We will get rid of the job. Warning for electricity employees.

ట్రాన్స్ కో ఉద్యోగులంతా ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటిస్తూ.. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అన్నారు. అలా నిబంధనలు ఉల్లంఘించిన సంస్థ ఉద్యోగులు, ఆర్టిజన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఆర్టిజన్ గా పనిచేస్తున్న ఓ విద్యుత్ ఉద్యోగి మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో అతనికి పోలీసులు రూ.1200 జరిమానా విధించడంతోపాటు.. ఈ విషయాన్ని ట్రాన్స్ కో సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న సీఎండీ..  విద్యుత్ ఉద్యోగులకు సర్క్యులర్‌ జారీ చేశారు. కాబట్టి విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు దొరికితే మీ ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయం. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు కాబట్టి ముందే జాగ్రత్తగా ఉంటే మంచింది అని అధికారులు సూచిస్తున్నారు.