దేశవ్యాప్తంగా ఒకటే డ్రైవింగ్ లైసెన్స్.. జూలై నుంచి.. - MicTv.in - Telugu News
mictv telugu

దేశవ్యాప్తంగా ఒకటే డ్రైవింగ్ లైసెన్స్.. జూలై నుంచి..

October 14, 2018

డ్రైవింగ్ లైసెన్స్ కష్టాలు తీరనున్నాయి. బదిలీలతో, నానా రాష్ట్రాల నిబంధనలతో ఇబ్బంది పడే జనానికి పెద్ద ఊరట లభించనుంది. దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యే ఒకే రంగు, రూపుతో కూడిన డ్రైవింగ్ లైసెన్సులు రానున్నాయి. 2019 జులై నుంచి దేశవ్యాప్తంగా ఒకే డ్రైవింగ్ లైసెన్స్ విధానం అమల్లోకి రానుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెలిపాయి.

eer

దీని కోసం ఏకీకృత విధానం కింద ఆధునిక లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్సీ)లను జారీ చేస్తారు. వీటిల్లో మైక్రోచిప్, క్యూఆర్ కోడ్లను ఉంచి, దేశవ్యాప్తంగా ఉన్న ఆర్టీవో నెట్ వర్కులతో అనుసంధానిస్తారు. తనిఖీకి వీలుగా వీటిలో ‘నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) వ్యవస్థ ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇలా ఉంటాయి..

కొత్త లైసెన్సులు, ఆర్సీలు అన్ని రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే రంగుల, డిజైన్, సెక్యూరిటీ ఫీచర్లతో ఉంటాయి. యజమాని ఒకవేళ అవయవదానం చేసినట్లు ప్రకటించి ఉంటే ఆ వివరాలను కూడా ముద్రిస్తారు. వికలాంగులు వాడే ప్రత్యేక వాహనాల వివరాలూ ఉంటాయి. వచ్చే ఏడాది జూలై నుంచి వీటిని ఇస్తామని, జారీ కోసం సుదీర్ఘ సమయం తీసుకున్నా ఈ వ్యవస్థ వల్ల పలు ప్రయోజానాలు ఉంటాయని అధికారులు చెప్పారు. కొత్త కార్డుల ధర రూ. 20 వరకు ఉంటుందని, దీనిపై పూర్తి వివరాలను రవాణా శాఖ వెల్లడిస్తుందని తెలిపారు.