పాకిస్తాన్ ను భయపెడుతున్న డ్రోన్ - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్ ను భయపెడుతున్న డ్రోన్

October 28, 2017
 • అవెంజర్ డ్రోన్ లంటే వణికిపోతున్న పాకిస్తాన్
 • ఇండియాకు 100 అవెంజర్ సీ డ్రోన్ లను సరాఫరా చేయడానికి రెడీ అయిన అమెరికా
 • అవెంజర్ డ్రోన్ లతోనే పాక్-ఆఫ్ఘన్ బోర్డర్ లో అల్ ఖైదా ఖతం
 • అమెరికా-ఇండియా డ్రోన్ డీల్ పై పాకిస్తాన్ అలర్ట్
 • ఉపఖండంలో అంశాంతికి దారితీస్తుందన్న పాక్ విదేశాంగ శాఖ
 • లైట్ తీసుకుంటున్న అమెరికా

       భారత్ కు 100 అవెంజర్ డ్రోన్ లను సప్లై చేయాలన్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయంతో పాకిస్తాన్ భయపడుతుంది. నిన్నమొన్నటిదాకా ఉగ్రవాదంపై పోరు పేరుతో పాకిస్తాన్ కు విచ్చలవిడిగా ఆయుధాలు సప్లై చేసిన అమెరికా స్టాండ్ మార్చుకుంది. దక్షిణ చైనా సముద్రాన్ని చుట్టేస్తున్న చైనాకు చెక్ పెట్టాలంటే భారత్ ను బలోపేతం చేయాలన్న స్టాండ్ ను అమెరికా తీసుకుంది. అందులో భాగంగానే మోస్ట్ డెడ్లీ వెపన్స్ అయిన అవెంజర్ డ్రోన్ లను భారత్ కు ఇవ్వాలని ట్రంప్ డిసైడ్ అయ్యాడు. భారత్ సరిహద్దుల్లో పటిష్టమైన నిఘాకు వంద అవెంజర్ డ్రోన్ లు కావాలని అమెరికాను కొన్నేళ్లుగా ఇండియన్ ఏయిర్ ఫోర్స్ అడుగుతోంది. కాని ఆ డ్రోన్ లను భారత్ కు ఇస్తే ఉగ్రవాదంపై పోరుకు పాకిస్తాన్ కలిసిరాదని ఇన్ని రోజులు అమెరికా వెనకాముందైంది. మొన్ననే పాకిస్తాన్ కు భారీగా ఆర్థిక, ఆయుధ సహాయం కూడా చేసింది. దీంతో పాకిస్తాన్ విషయంలో అమెరికా తోక వంకరే అనుకున్నారు. అయితే చైనాను దృష్టిలో పెట్టుకున్న అమెరికా, భారత్ ను బలోపేతం చేయాలన్న నిర్ణయానికి వచ్చిందని డిఫెన్స్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. అందుకే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఇండియన్ ఏయిర్ ఫోర్స్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటామని ట్రంప్ సర్కార్ చెప్పింది.

                 అమెరికా తాజా నిర్ణయంతో పాకిస్తాన్ అలర్ట్ అయింది. భారత్ కు అవెంజర్ డ్రోన్ లు ఇస్తే ఉపఖండంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారతాయని ఆ దేశ విదేశాంగ శాఖ  స్టేట్ మెంట్ ఇచ్చింది. అవెంజర్ డ్రోన్ లను ఇండియన్ ఆర్మీ  దుర్వినియోగం చేయవచ్చని విమర్శించింది. ఈ విషయాన్ని మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజీమ్ దృష్టికి కూడా తీసుకుపోతామని హెచ్చరించింది. అయితే ఇండియా-అమెరికా మిలట్రీ సంబంధాలకు తాము వ్యతిరేకం కాదని, అయితే అవి చైనానో, పాకిస్తాన్ నో దృష్టిలో పెట్టుకుని ఉండరాదన్నారు పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి నఫీజ్ జకారియా.

                   అవెంజర్ డ్రోన్ ల విషయంలో పాకిస్తాన్ అభ్యంతరాలను అమెరికా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

అవెంజర్ డ్రోన్ లంటే ఎందుకంత భయం:

 • అమెరికన్ ఏయిర్ ఫోర్స్ లో అవెంజర్ సీ డ్రోన్ లది కీ రోల్
 • అల్ ఖైదాపై పోరులో ఎక్కువగా వినియోగం
 • అవెంజర్ డ్రోన్ లతో నిఘాతో పాటు మిస్సైల్స్ ప్రయోగం
 • యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ కూడా ఉన్నాయి
 • మన భూభాగంపైన ఎగురుతూనే పాకిస్తాన్ లో ఉన్న టార్గెట్ పై దాడి
 • ఏకధాటిగా 18 గంటలపాటు 2,900 కిలోమీటర్ల వరకు ప్రయాణం