డ్రోన్ అనగానే చాలామందికి ఫొటోలు, వీడియోలు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ అదే డ్రోన్.. ఓ బాలుడి ప్రాణాలను కాపాడింది. ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, స్పెయిన్‌లోని వాలెన్సియాలో సముద్రంలో 14 ఏళ్ల బాలుడు అలల దాటికి లోపలికి వెళ్లిపోతాడు. ఒడ్డుకు వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు. అయినా అలల దాటికి సముద్రం లోపలికి వెళ్లిపోతుంటాడు. ఈ క్రమంలో అతన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది డ్రోన్‌ను పంపిస్తారు. బీచ్‌లో బలంగా వస్తున్న అలల్లో చిక్కుకుపోయి ఆ బాలుడు కొట్టుమిట్టాడుతుండగా లైఫ్ గార్డ్‌తో జత చేసి ఉన్న డ్రోన్ అక్కడికి వెళుతుంది. సరిగ్గా బాలుడి పైనుంచి ఆ లైఫ్ జాకెట్‌ను కిందకు వదులుతుంది.
బాలుడికి డ్రోన్ ద్వారా లైఫ్‌జాకెట్ అందించగా, దాని సహాయంతో లైఫ్‌గార్డ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని రక్షిస్తారు. ఫారిన్ కంట్రీలలో ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. డ్రోన్లు వచ్చిన తర్వాత మానవాళికి చాలా విషయాలు సులభమయ్యాయి. ముఖ్యంగా, రక్షణ, భద్రతా కార్యకలాపాల్లో డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వాలెన్సియాకు ఉత్తరాన ఉన్న సగుంటో అనే నగరంలో స్పానిష్ లైఫ్‌గార్డ్ సిబ్బందితో కలిసి జనరల్ డ్రోన్స్ వాలెన్సియా ఆధారిత కంపెనీ పనిచేయడం ప్రారంభించిన తర్వాత ఇప్పుడది స్పెయిన్ అంతటా 22 బీచ్‌లలో లైఫ్‌గార్డ్‌లతో కలిసి 30కి పైగా పైలట్లతో డ్రోన్లను వర్క్ చేయడానికి ఉంచింది. బాలుడిని రక్షించిన సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
A lifeguard drone saved the life of a 14-year-old boy who was struggling against the tide off a beach in Valencia, Spain. The drone dropped a life vest to the boy to keep him floating while the baywatch boat arrived. @generaldrones #drone #lifeguard #Spain #Valencia pic.twitter.com/UH7IxYuDAT
— Our World (@OurWorl91027476) July 25, 2022