Droupadi Murmu to take oath as 15th President Of India tomorrow
mictv telugu

రేపే రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం

July 24, 2022

భారతదేశ పదిహేనవ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈనెల 25(రేపు సోమవారం నాడు)న ప్రమాణస్వీకారం చేయనున్నట్టు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది21 గన్ సెల్యూట్స్ మధ్య పదవి బాధ్యతలను చేపట్టనున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉదయం 10.15 గంటలకు రాష్ట్రపతి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. పదవీ స్వీకారం తరువాత రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.

ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాను ఓడించారు. దేశంలోనే తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా, ప్రతిభా పాటిల్ తరువాత రెండో మహిళా రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించారు. మొత్తం ఎలక్టోరల్ కాలేజీలో 64 శాతం మంది మద్దతు పొందారు. స్వాతంత్య్రం తరువాత జన్మించి… అతి చిన్న వయసులో రాష్ట్రపతిగా పదవిని స్వీకరిస్తున్న మహిళగా ద్రౌపది ముర్ము రికార్డులకెక్కారు.