సన్నీలియోన్ కోసం బారులు తీరారు.. - MicTv.in - Telugu News
mictv telugu

సన్నీలియోన్ కోసం బారులు తీరారు..

August 18, 2017

బూతు రాతలు, మాటలు, సినిమాలకు ఉన్న ప్రజాదరణ తక్కువేం కాదని సన్నీలియోన్ కొచ్చి టూర్ కళ్లకు కట్టినట్టు చూపుతోంది. శృంగార చిత్రాల తార సన్నీ గురువారం ఓ మొబైల్ ఫోన్ల షాపును ప్రారంభించడానికి కొచ్చి వెళ్లింది. విషయం తెలుసుకున్న జనం ఆమెను చూసి తరించిపోవడానికి రోడ్లపై బారులు తీరారు. జనం పెద్ద సంఖ్యలో వీధుల్లో కిక్కిరిసిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ట్రాఫిక్ రద్దీ వల్ల సన్నీ కూడా అరగంట ఆలస్యంగా కార్యక్రమానికి హాజరైంది.

ఏదో తిరుణాలకో, లేకపోతే గణేశ్, దుర్గామాతల నిమజ్జనానికో వచ్చినట్లు జనం సన్నీకోసం ఎగబడ్డారు. ఆమె ఓ భవనంపై నుంచి వాళ్లను చూస్తూ చేతులూపుతూ పలకరించింది. ఫ్లయింగ్ కిస్సులూ ఇచ్చింది. ఆమాత్రం భాగ్యానికే యువత పులకరించిపోయిందట. తన జీవితంలో ఇంతమంతి అభిమానులను చూడ్డం ఇదే తొలిసారి అని సన్నీ కూడా ఉప్పొంగిపోయిందట. ఒక దశలో తీవ్ర భావోద్వేగానికి గురై అసలేమీ మాట్లాడలేకపోయిందట. ఈ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సన్నీ.. ‘నా కారు నిజంగానే ప్రేమ సముంద్రంలో మునిగిపోయింది’ అని కామెంట్ చేసింది.

కథ అంతటితో ముగిసిపోలేదండోయ్. సన్నీ ప్రోగ్రాంతో నగరంలో ట్రాఫిక్ ను స్తంభింపజేశారని పోలీసులు ఫోన్ షాపు దుకాణంపై కేసు పెట్టారు.