ప్రజాస్వామ్యంలో ధర్నాలు, ఆందోళనలు సహజమే. వారి సమస్యల కోసం ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తారు. తద్వారా తమ సమస్యలను సంబంధిత అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కరించుకుంటారు. తాజాగా నల్గొండ జిల్లాలో కొంతమంది మందుబాబులు నిరసన గళం వినిపించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామంలోని శివసాయి వెంకటేశ్వర వైన్ షాపు ముందు ఆందోళనకు దిగారు. తమ గ్రామంలోని వైన్స్ దుకాణంలో అన్ని రకాల మద్యం బ్రాండ్లను అమ్మాలని నినాదాలు చేశారు. అదే విధంగా కల్తీ మద్యంను అరికట్టాలని కోరారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని మందుబాబు డిమాండ్లు చేశారు. మందుబాబుల ఆందోళనల కోసం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్కు తీసుకెళ్లి సర్ధిచెప్పి పంపించారు. తమ సమస్యలు కోసం వైన్ షాపు ఎదుట ఆందోళనకు దిగిన మందుబాబులు దిగడం స్థానికులకు ఆశ్చర్యానికి గురిచేసింది. అరరే తాగుబోతన్నల్లకు ఎంత కష్టమచ్చింది అని సరదాగా మాట్లాడుకుంటున్నారు.