Drug gang anarchy..100 dogs on the police..and then
mictv telugu

డ్రగ్స్ ముఠా అరాచకం..పోలీసులపైకి 100 కుక్కలు..ఆ తర్వాత

September 1, 2022

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకొని, కొంతమంది యువకులు డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు..వారిపై కేసు నమోదు చేసి, గట్టి నిఘా పెట్టారు. అయినా కూడా కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించి, ఆన్‌లైన్‌లో డ్రగ్స్ దందాను కొనసాగిస్తున్నారు. అయితే, ఈ డ్రగ్స్‌ దందాను నడుపుతున్న వారందరు బాగా చదువుకున్నవారేకావటం విశేషం.

ఈ క్రమంలో విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు..ఈరోజు డ్రగ్స్ దందా ముఠాలపై దాడికి యత్నించారు. దాంతో రెచ్చిపోయిన నిందితులు..ఒక్కసారిగా పోలీసులపైకి 100 కుక్కలను వదిలారు. కుక్కల దాడిలో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై సీవీ ఆనంద్ మీడియా కాసేపటిక్రితమే సమావేశం ఏర్పాటు చేసి, వివరాలను వెల్లడించారు. ”హైదరాబాద్ నగరంలో మత్తు దందా గుట్టు రట్టయింది. మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశాం. హుమయూన్ నగర్‌లో డ్రగ్స్ అమ్మేందుకు యత్నించిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నాం. వీరి నుంచి రూ.9 లక్షల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నాం. వీరంతా డార్క్ వెబ్ ద్వారా మత్తు దందా చేస్తున్నారు. 30మంది వినియోగదారులను సైతం అదుపులోకి తీసుకున్నాం. వీరిలో ఇంజినీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారు” అని ఆయన తెలిపారు.