లక్ష్మీపతి మణికొండ నుంచే మత్తు దందా: డీసీపీ చక్రవర్తి - MicTv.in - Telugu News
mictv telugu

లక్ష్మీపతి మణికొండ నుంచే మత్తు దందా: డీసీపీ చక్రవర్తి

April 6, 2022

 

fbfdb

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గతకొన్ని రోజులుగా మత్తు పదార్థాలను విక్రయిస్తూ, బీటెక్ విద్యార్థి మరణానికి కారణమైన లక్ష్మీపతిని అరెస్టు చేశామని బుధవారం పోలీసులు తెలిపారు. అతనికి సంబంధించిన నేర చరిత్రను మీడియాకు వెల్లడించారు. నార్కోటిక్స్ విభాగం డీసీపీ చక్రవర్తి మాట్లాడుతూ..”డ్రగ్స్ సరఫరాదారు లక్ష్మీపతి అతనికున్న నెట్‌వర్క్‌తో హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్నాడు. అతడి వద్ద 18 మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారు. 2018లో లక్ష్మీపతి రెండు కేసుల్లో అరెస్టయ్యాడు. అతడిపై ఇప్పటి వరకూ 6 కేసులు ఉన్నాయి. విశాఖలో నిందితుడిని అరెస్టు చేశాం. 5 గ్రాముల హ్యాష్ ఆయిల్ విలువ రూ. 8 వేలు ఉంటుంది.

అనంతరం లీటరు హ్యాష్ ఆయిల్ విలువ రూ. 6 లక్షల వరకు ఉంటుంది. నిందితుల వద్ద 840 గ్రాముల హ్యాష్ అయిల్ స్వాధీనం చేసుకున్నాం. దీని విలువ రూ.5 లక్షల వరకు ఉంటుంది. నల్లకుంటలో నమోదైన కేసులో లక్ష్మీపతితో 18 మంది కాంటాక్టులో ఉన్నట్టు తెలిసింది. అరకు నుంచి లక్ష్మీపతికి హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నగేశను కూడా అరెస్టు చేశాం. నగేశ్ అరకులో గంజాయి పండిస్తూ హ్యాష్ అయిల్ తయారు చేస్తున్నాడు.

అంతేకాకుండా ఒడిశా, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ముంబై, ఉత్తరప్రదేశ్, బిహార కూడా హ్యాష్ అయిల్ సరఫరా చేస్తున్నాడు. ఇతనిపై నల్గొండలో కేసు నమోదైంది. ఈ కేసులో మరికొంత మంది నిందితులు పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటాం’ అని డీసీపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్ష్మీపతి బీటెక్ మధ్యలోనే ఆపేశాడు. మకాం మణికొండకు మార్చి మత్తు దందా ప్రారంభించాడు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో తక్కువ ధరకు హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసి దానిలో మద్యం కలిపి 5-10 మి.లీ చొప్పున ప్లాస్టిక్ సీసాల్లోకి మార్చి రూ. 3000-4000 చొప్పున విక్రయించేవాడని వివరాలను వెల్లడించారు.