డ్రగ్స్ పై JAC జంగ్ సైరన్ ! - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్ పై JAC జంగ్ సైరన్ !

August 8, 2017

డ్రగ్స్ మనుషులను ఎంతగా పాడుచేస్తుందో ? మరీ ముఖ్యంగా యూత్ ను నీరుగారుస్తున్న మత్తు భూతం భూస్థాపితం అయ్యేదెప్పుడు ? దీనికి బానిసలౌతున్న వారి మత్తు వదిలించాలంటే ఏం చెయ్యాలి ? జనాల్లో దీని గురించిన అవగాహన అత్యవరమే. అందులో భాగంగానే ‘ డ్రగ్స్ మహమ్మారిని అరికడుదాం – యువత ఉజ్వల భవిష్యత్తును కాపాడుదాం ! ’ అనే నినాదంతో తెలంగాణ జెఏసి దిల్ సుఖ్ నగర్ బస్ స్టాండ్ ( రాజీవ్ చౌక్ ) నుండి రైస్ మిల్లర్ అసోసియేషన్ బిల్డింగ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ JAC ఛైర్మన్ కోదండరాం, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పటికే సినిమా రంగంలో చాలా మంది సెలెబ్రిటీలు డ్రగ్స్ రాకెట్లో ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అలాగే ఎంతో మంది చదువుకుంటున్న యువత కూడా ఈ డ్రగ్స్ కు అలవాటు పడి తమ భవిష్యత్తును పాడు చేస్కుంటున్నారు. అలా ముందు ముందు జరక్కూడదనే మంచి వుద్దేశ్యంతో JAC చేస్తున్న ఈ ప్రయత్నం యువతను ఆలోచింపజేస్తే నయమని భావిస్తోంది JAC.